Sunday, March 4, 2007

ఆకులో ఆకునై - చిత్రం : మేఘ సందేశం

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో

గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో

తరులెక్కి ఇల నీలి గిరినెక్కి
మెలమెల్ల చగలెక్కి
జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీ వెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఎచటనే ఆగిపోనా

ఆకులో

No comments: