Sunday, March 4, 2007

దారి చూపిన దేవతా - చిత్రం : గృహ ప్రవేశం

దారి చూపిన దేవతా ఈ చేయి యెన్నడు వీడక
దారి చూపిన దేవతా ఈ చేయి యెన్నడు వీడక
జన్మ జన్మకు తోడుగ నా దానివై నువ్వు నడచిరా

దారి చూపిన దేవతా

మనసులేని శిలను నేను నువ్వు చూసిన నిన్నలో
మమత తెలిసి మనిషి నైతి చల్లనైన నీ చేతిలో
కన్నులు తెరిచిన వేళలో నీకేమి సేవలు చేతును

దారి చూపిన దేవతా

మరపు రాదు మాసి పోదు నేను చేసిన ద్రోహము
కలను కూడ మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము
ప్రేమ నేర్పిన పెన్నిది ఆ ప్రేమ నిన్ను దీవించనీ

దారి చూపిన దేవతా

No comments: