Sunday, March 11, 2007

నీలి మేఘమా జాలి చూపుమా - చిత్రం : అమ్మాయిల శపథం

నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిమిష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా

కన్నె అందమా కలత మానుమా ఒక నిమిషమాగుమా
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

ఆనుకోని రాగాలు వినిపించే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
రా జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ నను చెరగా

నీలి మేఘమా జాలి చూపుమా

కళ్యాణ మేళాలు మ్రొగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రొగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
గుండె గుడిగా చెయనా నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై నా వాసివై నా ప్రెమ పుష్పాల పూజించనా

కన్నెఅందమా కలత మానుమా

No comments: