Wednesday, February 21, 2007

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా - చిత్రం : డాక్టర్ చక్రవర్తి

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే
నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే
నీకు కాక యెవరి కొరకు నీవు వింటె చాలు నాకు

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చిన్న నాటి ఆశలే ఈ నాడు పూసెను పూవులై
చిన్న నాటి ఆశలే ఈ నాడు పూసెను పూవులై
ఆ పూవులన్ని మాటలై వినుపించు నీకు పాటలై

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడ జాలక పోయినా
ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడ జాలక పోయినా
నీ మనసులో ఈనాడు నిండిన రాగ మటులే వుండని
అనురాగ మటులే వుండనీ

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

జగడ జగడ జగడం చేసేస్తాం - చిత్రం : గీతాంజలి

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రిక్కటిల్లిపోయే

జగడ జగడ జగడం చేసేస్తాం

ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటలో
మా వెనకే వుంది ఈ తరం మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢియ్యాటలో
నేడేరా నీకు నేస్తము రేపే లేదు
నిన్నంటే నిండు సున్న రా రానే రాదు
ఏడేడు లోకాల తోన బంతాట లాడాలి ఈ నాడె
తక తకదిమి తకఝను

జగడ జగడ జగడం చేసేస్తాం

పడనీరా విరిగి ఆకసం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేను లే
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము మా సిధ్ధాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చేయాలి లోకం మా జోరు చూసాక ఈ నాడె
తక తకదిమి తకఝను

జగడ జగడ జగడం చేసేస్తాం

యమునా తీరమున సంధ్యా సమయమున - చిత్రం : జయభేరి

యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కన్నులతో రాధ వేచి ఉన్నది కాదా

మంజు ఎంటి ఆపేసావు ?
ఏమి లేదు
ఆపకు మంజు నీ గాలి మువ్వల సవ్వడి
నా గానానికి జీవం పోయాలి
నా పాటకు నడక నేర్పాలి

రావోయి రాసవిహారి
బాస చేసి రావేల మదన గోపాల
బాస చేసి రావేల మదన గోపాల
నీవు లేని జీవితము తావి లేని పువ్వు కదా

యమునా తీరమున

పూపొదలో దాగనేల పో పోర సామి
ఇంతసేపు ఏ ఇంటికి వంత పాడినావొ
దాని చెంతకె పోరాదో
రానంత సేపు విరహమ
నేను రాగానే కలహమ
రాగానే కలహమ
నీ మేన సరసాల చిన్నెలు
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
ఏ కొమ్మ కొనగూటి ఆనవాలూ

యమునా తీరమున

దోబూచులాడితి నీతోనే
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు
ఈ కొమ్మ గురుతులు కాబోలు
నేను నమ్మనులే
నేను నమ్మనులే నీ మాటలు
అవి కమ్మని పన్నీటి మూటలు
నా మాట నమ్మవె రాధిక
ఈ మాధవుడు నీ వాడే గా
రాధికా ... మాధవా ...
రాధికా ... మాధవా ...

యమునా తీరమున

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా - చిత్రం : ఇంద్ర

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా
దాయి దాయి దామ్మా పలికే గండు కొయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఓహో ఓ ఒళ్ళో వాలు మా ఓహో ఓ వయసే గిల్లుమా
నీవెల్లా విరబూసే నవ యవ్వనాల బొమ్మ
తొలిజల్లే తరిమేసే సరసాలు కొంటెతనమా

దాయి దాయి దామ్మా

టక టక మంటూ తలపులు తట్టి తికమక పెట్టే
లకుమకి పిట్టా నిను వదిలితే ఎట్టా
నిలబడ మంటూ నడుమును పట్టి కిటకిట పెట్టే
మగసిరి పట్టా కథ ముదిరేది ఎట్టా
కేరింత లాడుతూ కవ్వించ లేదా కాదంటె ఇప్పుడు తప్పేదెలా
కాదంటే ఇపుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జానంటూ లేదా ఏం దుడుకు బావా ఆపేదెలా
ఏం దుడుకు బావా ఆపేదెలా
ఓహో ఓ కోరిందే కదా ఓహో ఓ మరీ ఇంత ఇదా
మరి కొంచెం మరిపించే ఈ ముచ్చటంతా చేదా
వ్యవహారం శృతి మించే సుఖ మారి బెదిరి పోదా
హాయ్ హాయ్ హాయ్ అనరే పైట జారి పోయే
పాపా గమనించవే మా కొంప మునిగిపోయే అయ్యో

దాయి దాయి దామ్మా

పురుషుడు ఎట్టా ఇరుకున పెట్టె పరుగుల పరువా
సొగసుల దరువా ఓ తుంటరి మగువా
ముడుపులు ఎట్టా ఎదురుగా పెట్టా ఎదుగడలేవా
నాకు జత కావా నా వరసైపోవా
అల్లాడి పోకే పిల్లా మరి ఆ కల్యాణ ఘడియ రానీయవా
కల్యాణ ఘడియ రానీయవా
అని అందాక ఆగదు ఈ అల్లరి నీ హిత భోధలాపి శృతి మించవా
హిత భోధలాపి శృతి మించవా
అనుమానం అడిగింది నువ్వు ఆడపిల్లవేనా
సందేహం లేదయ్యొ నీ పడుచు పదును పైన

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి - చిత్రం : ఆత్మ బంధువు

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నరు
వారు చదువు సంధ్యలుండి కూడ
చవట లయ్యారు వొట్టి చవట లయ్యారు

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

పడక మీద తుమ్మ ముళ్ళు పరచె నొక్కడు
అయ్యో ఇంటి దీప మార్పి వేయ నెంచె నొక్కడు
తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు
తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు
పడుచు పెళ్ళామే బెల్లమని
భ్రమసె నొక్కడు భ్రమసె నొక్కడు

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమ యనె పాలు పోసి పెంపు చేసేను
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమ యనె పాలు పోసి పెంపు చేసెను
కంటి పాప కంటె యెంతొ గారవించెను
కంటి పాప కంటె యెంతొ గారవించెను
దాని గుండె లోన గూడు కట్టి
ఉండ సాగెను తానుండ సాగెను

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నదె ఒక నాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నదె ఒక నాటికి రత్నమౌనురా
కూరిమి గల వారంతా కొడుకు లేనురా
కూరిమి గల వారంతా కొడుకు లేనురా
జాలిగుండె లేని కొడుకు కన్న
కుక్క మేలురా కుక్క మేలురా

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

అంతా భ్రాంతియేనా - చిత్రం : దేవదాసు

అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

అంతా భ్రాంతియేనా

చిలిపి తనాల చెలిమే మరచితివో
చిలిపి తనాల చెలిమే మరచితివో
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో
పేదరికమ్ము ప్రేమ పదమ్ము మూసి వేసినదా
నా ఆశే దోచినదా

అంతా భ్రాంతియేనా

మనసున లేని వారి సేవలతో
మనసున లేని వారి సేవలతో
మన సేయగలేని నీపై మమతలతో
మన సేయగలేని నీపై మమతలతో
వంతలపాలై చింతిల్లుటేనా వంతా దేవదా
నావంతా దేవదా

అంతా భ్రాంతియేనా

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే - చిత్రం : ఇంద్ర

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా

హరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా
జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ సీమలో ఈ వేళ రతనాలు దారలే కురిసేలా

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా

రాకసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖనీ ఇపుడే పంపనీ
అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రా రమ్మనీ
ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
తొలగింది ముప్పు అది నీలి మబ్బు మనసార నవ్వనీ
చిరుజల్లు ముంపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ
ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమై పాడెగా
శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళా

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా

భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకగా
ఆకశాన్నే ఇల దించరా కురిసే వానగా
మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా
ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా
మహరాజు కాలి సమిదల్లే మారి నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగన్ని వలచి తాపసిగా నిలిచెరా
జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హేమ జ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెరా అమృతములు ఆహ్వానించెనురా

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా

దేవతలారా రండి మీ దీవెనలందించండి - చిత్రం : ఆహ్వానం

దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి

కలలో ఇలలో యే కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి

కలలొ ఇలలో

శివ పర్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరినీ మా జతలో చూపించాలి
శ్రీ కాంతుల కోలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలి లోన పున్నమి పూల వెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి

కలలొ ఇలలో

తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళ తేచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వేలుగిచ్చే మణి దీపం నీవంటాడు
ఈ పుత్తడి బోమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట
నిధి నిక్షేపాలు నిదురే లేచి ఏదురొచ్చేనంట

కలలొ ఇలలో

పాడనా తెలుగు పాట - చిత్రం : అమెరికా అమ్మాయి

పాడనా తెలుగు పాట పాడనా తెలుగు పాట
పరవశమై మీ ఎదుట మీ పాటపాడనా తెలుగు పాట

పాడనా తెలుగు పాట

కోవెల గంటల ఘన ఘనలో గోదావరి తరగల గల గలలో
కోవెల గంటల ఘన ఘనలో గోదావరి తరగల గల గలలో
మావులు పూవులు మోపుల పైనా మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట

పాడనా తెలుగు పాట

త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివి తీర వినిపించినది
నాడు నాడులా కదిలించేది
వాడ వాదలా కనిపించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల వూట ఒక పాట

పాడనా తెలుగు పాట

ఒళ్ళంత వయ్యారి కోక కనులకు కాటుక రేఖ
ఒళ్ళంత వయ్యారి కోక కనులకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడె
తెలుగు తల్లి పెట్టని కొత్త తెనుగును నాట ప్రతి చోట ఒక పాట

పాడనా తెలుగు పాట

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా - చిత్రం : గీతాంజలి

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం నింగీ నేలా తాకేదెలాగ

ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలు మాసి పోవు ఆశలు
నింగీ నేలా తాకే వేళ నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే వీడుకోలిదే వీడుకోలిదే

ఓ ప్రియా ప్రియా

నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలి లాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో నీ ప్రేమ

ఓ ప్రియా ప్రియా

కాళిదాసు గీతికి కృష్ణ రాస లీలకి
ప్రణయ మూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి తాజ్మహల్ శోభకి
పేదవాడి ప్రేమకి చావు పల్లకి
నిధికన్న ఎద మిన్న గెలిపించు ప్రేమని
కధ కాదు బ్రతుకంటే బలికానీ ప్రేమనే
వెళ్ళి పోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళి పోకుమా
జయించేది ఒక్కటే నీ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసీ తీర్చమంది నీ కసి
నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయె క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం

ఓ ప్రియా ప్రియా

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా - చిత్రం : నువ్వు నాకు నచ్చావ్

ఆ నీలి గగనాన వెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచానో నే నిన్ను చేర
ఏనాటి స్వప్నం నీ దివ్యరూపం
శతకోటి రాగాలు రమణించె నా గుండెలోన

ఓ ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా
ఇది మనసుపడిన విరహవేదనా
తొలి ప్రేమలోని మధుర భావనా
ఒ ప్రియతమా ఇది నిజమా
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా

నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్ఛాయొ చెప్పేదెలా
ఎన్ని నయనాలు నావంక ఎర్రంగా చూశాయొ ఆగుట్టు విప్పేదెలా
ఓ ప్రియతమా దయ గనుమా నీ చూపేచాలు చంద్ర కిరణమా
నా జన్మ ధన్యమౌనె ప్రాణమా

ఆ నీలి గగనాన మెరిసేటి

చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించినా నెలవంకవో
నువ్వేమొ నాజూకు నడువేమొ పూరేకు నీ అందమే మందునే
పలుకేమొ రాచిలక నడకేమొ రాయంచ ఒళ్ళంత వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేదంగా భావించి జపియిస్తున్నానే చెలి
నీ పాదాలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి
ఓ ప్రియతమా ఔననుమా కనలేవా ప్రియుని హృదయ వేదనా
కరుణించు నాకు వలపు దీవెన

ఆ నీలి గగనాన మెరిసేటి

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది - చిత్రం : మన్మథుడు

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఎమౌనో నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తుదివరమో తీయని తరుణం ఇది

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఎమౌనో నీ పేరే పిలుస్తొంది
మనస మనస మనస మనస మనస మనస
ఓ మనస ఓ మనస

పూవులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడౌను విని
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే తాకి కలలన్ని నిదురగా వచ్చి నట్టుంది
ఏమో ఇదంతా నిజంగా నిజంగా కల లాగె ఉంది

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది

ఎందుకో తెలియనీ కంగారు పడుతున్నదీ
యెక్కడ జరగనీ ఇంకేమికాదే ఇది
పరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించి పరిచయం తోడు కోరింది
దూరం తలోంచె ముహూర్తం ఇంకెపు డొస్తుంది

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది

అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో - చిత్రం : ఇంద్ర

అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి గాలికి కుర్రాడు అవుటయ్యో
తడి సోకుల్లో సొగసేం పని ఎరుపెక్కే కసి జివ్వని
ఓ కొబ్బరి ముక్కా పువ్వుల పక్కా వేయించమ్మ ఎంచక్కా

అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో

సోకుల ఎరనే చూపి చిరు కాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి
చూపుల సూదులతోటి నా కోకల కోనలు దాటి
తుంటరి తుంటడు మారాం అంటే ఎట్టా వేగేదేంటీ
ధీటుగ వచ్చిలాటుగా చేరి చేయమంటావా చక్కెర కేళి
పైట రాగాల కోటలోకింక చేరవా బ్రహ్మచారి
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో నెరజాణా నవ్వెక్కిందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో మోమాటం చెట్టెక్కిందయ్యో

అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో

అచ్చిక బుచ్చిక లాడి తనువెచ్చని తాకిడి తోటి
నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది
వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మద్యన దుప్పటి కడితే దూరం కాదా బేబీ
చాటుగా వచ్చి చేతి వాటాన్ని చేయవోయ్ ఇక వన్నెల వోణి
లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి

అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో

Wednesday, February 14, 2007

జాబిల్లి కోసం ఆకాశ మల్లె వేచాను నీ రాక కై - చిత్రం : మంచి మనసులు

జాబిల్లి కోసం ఆకాశ మల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశ మల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాషమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాషమల్లే వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే

జాబిల్లి కోసం

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసోక్కటి కలిసున్నది యేనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసోక్కటి కలిసున్నది యేనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీకన్నులుగా
నును నిగ్గుల ఈ మోగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ వుర్రూతలూగీ మేఘాల తోటి రాగాల లేఖ
నీ కంపినాను రావా దేవి

జాబిల్లి కోసం

నీ పేరోక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది యెన్నాళ్ళైనా
నీ పేరోక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది యెన్నాళ్ళైనా
ఉండీ లేకా వున్నది నీవే వున్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే
దూరాన వున్నా నా తోదు నీవే నీ ధగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంత నీవే నీవే

జాబిల్లి కోసం

నీ చెలిమి నేడే కోరితిని - చిత్రం : ఆరాధన (అక్కినేని ?)

నీ చెలిమి నేడే కోరితినీ ఈక్షణమె ఆశ వీడితి
నీపూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని
పూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని
నీ చెలిమి నేడె కోరితిని ఈక్షణమె ఆశ వేడితిని నీ చెలిమి

నీ చెలిమి నేడే

మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనే
మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనె
పరుల సొమ్మై పోయినావని నలిగె నా మనసె

నీ చెలిమి నేడే

చెదరి పోయిన హృదయము లోన పదిల పరచిన మమతలు నీకే
చెదరి పోయిన హృదయము లోన పదిల పరచిన మమతలు నీకే
భారమైన దూరమైన బ్రతుకు నీ కొరకే

నీ చెలిమి నేడే

కోడి కూసే జాము దాక - చిత్రం : అదృష్టవంతులు

కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా

కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను
కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువ రేడా

కోడి కూసే జాము దాకా

కంటికింపౌ జంటలంటె వెంట పడతావంట నువ్వు
కంటికింపౌ జంటలంటె వెంట పడతావంట నువ్వు
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతొ వేపుతావట
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతొ వేపుతావట
మత్తు తెలిసిన చందురూడా
మసక వెలుగే చాలు లేరా

కోడి కూసే జాము దాకా

అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది
అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది
చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
తీపి మబ్బుల చందురూడా
కాపువై నువ్వుండి పోరా

కోడి కూసే జాము దాకా

కలగంటి కలగంటి - చిత్రం : అన్నమయ్య

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్ల లోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశు గంటి

కలగంటి కలగంటి

అతిశయంబైన శేషాధ్రి శిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోతి సుర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు పొడగంటి
చతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి

కలగంటి కలగంటి

అరుదైన శంఖ చక్రాదు లిరు గడ గంటి
సరిలేని అభయ హస్తమును కంటి
తిరు వేంకటాచల రిపుని చూడగ గంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట మేలుకంటి

కలగంటి కలగంటి

చల్తీ కా నాం గాడీ - చిత్రం : చెట్టు క్రింద ప్లీడర్

చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ
చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ
రంగేళి జోడీ బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా
తప్పవా దారి చెప్పవా చెప్పవా

చల్తీకానాం గాడీ

దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు
విరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు
అశోకుడు యుధ్ధంలోన వాడిందీ ఈ కారు
శివాజీ గుర్రం వీడి ఎక్కిందీ ఈ కారు
చరిత్రల లోతులు చేరి వ్రాతలు మారి
చేతులు మారినదీ జంపరు బంపరు బండిరా
బండిరాజగ మొండిరా మొండిరా

చల్తీకానాం గాడీ

ఆంగ్లేయులు తోలిన కారు అంధ్రానే ఏలిన కారు
అందాల లండన్ కారు అన్నింటా ఇండియన్ కారు
బులెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు
రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు
హుషారుగ ఎక్కిన చాలు
దక్కును మేలు చిక్కు శిఖాలు
ఇదే సూపరు డూపరు బండిరా
బండిరా జగ మొండిరా మొండిరా

చల్తీకానాం గాడీ

జీవితమే సఫలము - చిత్రం : అనార్కలి

జీవితమే సఫలము
జీవితమే సఫలము
ఈ జీవితమే సఫలము
రాగ సుధా భరితమూ
ప్రేమ కధా మధురము

జీవితమే సఫలము

హాయిగా తీయగా ఆలపించు పాటలా
హాయిగా తీయగా ఆలపించు పాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు మాటలా
వరాల సోయగాల ప్రియుల వలపు మాటలా
అనారు పూల తోటలా
అనారు పూల తోటలా
ఆశ దెలుపు ఆటలా

జీవితమే సఫలము

వసంత మధుర సీమలా ప్రశాంత సంజ వేళలా
వసంత మధుర సీమలా ప్రశాంత సంజ వేళలా
అంతులేని వింతలా అనంతప్రేమ ప్రేమ లీలగా
అంతులేని వింతలా అనంతప్రేమ ప్రేమ లీలగా
పరించు భాగ్యశీలలా
పరించు భాగ్యశీలలా
తరించు ప్రేమ జీవులా

జీవితమే సఫలము

తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో - చిత్రం : సీతా రాములు

తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

తొలి సంధ్య వేళలో

జీవితమే రంగుల వలయం
దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం
మేలుకొలిపే అనురాగం

తొలి సంధ్య వేళలో

సాగరమే పొంగుల నిలయం
దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం
మేలుకొలిపే అనురాగం

తొలి సంధ్య వేళలో

పూసింది పూసింది పున్నాగ - చిత్రం : సీతారామయ్య గారి మనవరాలు

పల్లవి పూసింది పూసింది పున్నాగ
కూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ

పూసింది పూసింది పున్నాగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగ
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయు లీనమై
పాడె మది పాడె

పూసింది పూసింది పున్నాగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసి మొగ్గరేకులే పరువాల చూపులై
పూసె విరబూసె

పూసింది పూసింది పున్నాగ

వన్నెల చిన్నెల - చిత్రం : పాండురంగ మహాత్మ్యం

వన్నెల చిన్నెల నెర కన్నెల వెతల దొరా
జాణవు నా హృదయ రాణివి నీవే కూరిమి చేరగ రావె చెలి

వన్నెల చిన్నెల

కని విని ఎరుగము గదా ఇది ఎంతో వింత సుమా
కని విని ఎరుగము గదా ఇది ఎంతో వింత సుమా
కాలులే సతికి కన్నులే గీతు చతురులే పెనిమిటైనా

వన్నెల చిన్నెల

అలక లేలనె చెలీ అలవాటున పొరపాటదీ
అలక లేలనె చెలీ అలవాటున పొరపాటదీ
మురిసిపోవాలి చల్లని ఈ రేయి పరిమళించాలి హాయి

వన్నెల చిన్నెల

అరె ఏమైందీ - చిత్రం : ఆరాధన (చిరంజీవి)

అరె ఏమైందీ
అరె ఏమైందీ

ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది

అరె ఏమైందీ

నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదూ పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావోఅది దోచావో

అరె ఏమైందీ

బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో
చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడుమనిషౌతాడు

అరె ఏమైందీ

Saturday, February 10, 2007

అలిగితివా సఖీ ప్రియా - చిత్రం : శ్రీ కష్ణార్జున యుద్ధం

అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏల జాలవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా

అలిగితివా సఖీ ప్రియా

లేని తగవు నటింతువా
మనసు తెలియనెంచితివా
లేని తగవు నటింతువా
మనసు తెలియనెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయను జూడవా

అలిగితివా సఖీ ప్రియా

నీవె నాకు ప్రాణమని
నీ ఆనతి మీరననీ
వె నాకు ప్రాణమని
నీ ఆనతి మీరననీ
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా

అలిగితివా సఖీ ప్రియా

ప్రియురాలివి సరస నుండి
విరహ మిటుల విధింతువా
ఆ ... ప్రియురాలివి సరసనుండి
విరహమిటుల విధింతువా
భరింపగ నా తరమా కనికరించవా

అలిగితివా సఖీ ప్రియా

Monday, February 5, 2007

పట్టుదలతో చేసెయ్ సమరం - చిత్రం : సంబరం

పట్టుదలతో చేసేయ్ సమరం తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
ఈ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడక
నీ ధ్యేయం చూపే మార్గంలో నువు పోరా సూటిగా
ఏ నాడు వెనకడు గేయక ఏ అడుగు తడబడ నీయక
నీ గమ్యం చేరే దాక ధూసుకు పోరా సొదరా

ఇష్టం ఉంటే చేదు కూడ తీయనే
కష్టం అంటే దూది కూడ భారమే
లక్ష్యమంటు లేని జన్మే దండగ
లక్షలాది మంది లేరా మందగా
పంతం పట్టి పోరాడందే
కోరిన వరాలు పొందలేరు కదా

పట్టుదలతో

చేస్తు ఉంటే ఏ పనైనా సాద్యమే
చూస్తు ఉంటే రోజులన్ని శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనేది లేదురా
నవ్వే వాళ్ళు నిద్దుర పోగా
దిక్కులు జయించి సాగిపోరా మరి

పట్టుదలతో

ఉన్నారా జోడున్నారా - చిత్రం : జయభేరి

ఉన్నారా జోడున్నారా నన్నోడించెవారు
ఉన్నారా జోడున్నారా నన్నోడించెవారు
అందంలో చందంలో ఆటల పాటల అన్నిటిలో
ఓ గజ్జ కట్టి నే ఆడితినా కంఠం విప్పి పాడితినా
గజ్జ కట్టి నే ఆడితినా కంఠం విప్పి పాడితినా
హెయ్ ఆడితినా నే పాడితినా
హెయ్ ఆడితినా నే పాడితినా

కులుకుల పలుకుల హంసల నడకల
కిల కిల కల కల కులుకుతు పలికితినా
చక్కిలి గింతలు కలిగింతు
ఇక్కడె స్వర్గం కనిపించు మైమరపించు

ఉన్నారా జోడున్నారా

స రి రి మ మ ప ని స్వర రాగముల చిత్ర గత్రముల మోగిస్తా
తద్దిమి ధిమితక తలాంగు తకతి అంటూ నాట్యం చేస్తా
సరి వారలతో సవాలు చేస్తా హెయ్ సవాలు చేస్తా
సవాలు చేస్తా సవాల్ సవాల్ సవాల్ గెలిచిన వారికి సలాము చేస్తా
సవాల్ సవాల్ సవాల్ మూతి మీద మీసం ఉన్న మొగోడు రండి పైకి

ఉన్నారా జోడున్నారా

ప్రియతమా ఓ ప్రియతమా - చిత్రం : నవ్వూ నేను

ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌన రాగాలనే పలికే హృదయం
నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని
కలవరిస్తొందని తెలుసా
ఎప్పుడో అపుడెప్పుడో ముడి పడినది ఈ బంధమేదో
ఇప్పుడె ఇప్పుడిప్పుడె నీ మనసు చెప్పింది నాతో
వాన విల్లు యెదో మెరిసిందలా
పూల జల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురగమో ఈ వింత మాయ నేమంటారో

ప్రియతమా ఓ ప్రియతమా

గుట్టుగ కనిపెట్టగ మనసంతనే సంతకాలె
మత్తుగ గమ్మతుగ యెద నిండ నీ జ్ఞాపకాలే
నిన్ను చూడకుండ మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో ఈ వింత మాయ నేమంటారో

ప్రియతమా ఓ ప్రియతమా

ఈ మౌనరాగలనె పలికె హౄదయం
నిన్ను చేరిందని తన మనసు విప్పిందని
ఐ లవ్యూ అంటోందని తెలుసా

ప్రియతమా ఓ ప్రియతమా

ఆమని పాడవే హాయిగా - చిత్రం : గీతాంజలి

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల

ఆమని పాడవే

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల రాయగా స్వరాల సంపదతరాల నా కథ
క్షణాలదే కదా గతించి పోవు గాధ నేననీ

ఆమని పాడవే

శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయం
దివీ భువీ కలా నిజం స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోని గాధ నేననీ

ఆమని పాడవే

సిగలో అవి విరులో - చిత్రం : మేఘ సందేశం

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువా సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో

ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు
మదిలోనా గదిలోనా మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు నిలువనీవు నా తలపులు
మరి మరి ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు

సిగలో అవి విరులో

జరిగి ఇటు వొరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు వొరిగి పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడినా
చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు
మరి మరి ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు
మధువుకయి మెదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా - చిత్రం : అన్నమయ్య

పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా

పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయెక వయ్యా కోనేటి రాయడా
పోడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయెక వయ్య కోనేటి రాయడా

పోడగంటి మయ్యా మిమ్ము

కోరి మమ్ము నేలినట్టి కుల దైవమా
చాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా

పొదగంటి మయ్యా మిమ్ము

చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా
చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా
మమ్ము గడియించినట్టి శ్రి వేంకట నాధుడా

పొదగంటి మయ్యా మిమ్ము

నీవేనా నను తలచినది - చిత్రం : మాయా బజార్

నీవేనా
నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది
నీవేనా నామదిలో నిలిచి హౄదయము కలవర పరిచినది
నీవేనా

నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవర పరిచినది
నీవేలే

కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైష్ణవ మాయో
తెలిసి తెలియని అయోమయములో

నీవేనా నను తలచినది

కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి
కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి
కనులను మనసును కరగించి
మైమరపించి నన్నలరించి

నీవేనా నను తలచినది

రామ సుగుణ ధామ - చిత్రం : లవకుశ

రామ సుగుణ ధామ రఘు వంశ జలధి సోమ
శ్రీ రామ సుగుణ ధామ సీతా మనోభి రామ సాకేత సార్వభౌమా

మందస్మిత సుందర వదనారవింద రామ
ఇందీవర శ్యమలాంగ వందిత స్రమ
మందార మరందోపవ మధుర మధుర నామ
మందార మరందోపవ మధుర మధుర నామ

రామ సుగుణ ధామ

అవతార పురుష రావణాది దైత్య విరామ
నవనీత హృదయ ధర్మ నిరత రాజల రామా
అవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామ
అవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామ

రామ సుగుణ ధామ

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలీ - చిత్రం : ఆపద్బాంధవుడు

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ
వెళనివ్వరా వెన్నెలింటికి
విన్నవించరా వెండినింటికి

జోజో లాలి జోజో లాలి
జోజో లాలి జోజో లాలి

మలి సంధ్య వేళాయె చలిగాలి వేణువాయె
నిద్దురమ్మా ఎటు బోతివే
ముని మాపు వేళాయె కనుపాప నిన్ను కోరె
కునుకమ్మా ఇటు చేరవె
నిదురమ్మ ఎటు బోతివే కునుకమ్మ ఇటు చేరవె
నిదురమ్మ ఎటు బోతివే కునుకమ్మ ఇటు చేరవె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వున రావె
జోల పాడవా బేల కళ్ళకి
వెళ్ళ నివ్వరా వెన్నెలింటికీ
జోజో లాలి జోజో లాలి
జోజో లాలి జోజో లాలి

చుక్కల్లారా చూపుల్లారా

పట్టు పరుపులేలా పండు వెన్నెలేలా
అమ్మ వొడి చాలదా బజ్జోవె తల్లి
పట్టు పరుపులేలా పండు వెన్నలేలా
అమ్మ వొడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలా నాగబ్రహ్మలేలా
అమ్మలాలి చాలదా బజ్జోవె తల్లి
నారదాదులేలా నాగబ్రహ్మలేలా
అమ్మలాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో
తీయనైన కలలెన్నో ఊయలూగు వేళలో
అమ్మలాలి పడి కొమ్మలారి ఏది ఏమైయ్యాడు
అంతులేడ దియ్యాల కోటి తందనాల ఆనంద లాల
గోవుల్లాల పిల్లంగోవులాల గోల్ల భావఁలాల
యాడనుండయాల నాటి నందనాల ఆనంద లీల
జాడచెప్పరా చిట్టి తల్లికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో లాలి

చుక్కల్లారా చూపుల్లారా

అదివో అల్లదివో శ్రీహరి వాసము - చిత్రం : అన్నమయ్య

ఏడు కొండల వాడ వెంకటా రమణ గొవిందా గొవిందా
అదివో
గొవింద గొవింద గొవింద గొవింద గొవింద
గొవింద గొవింద గొవింద గొవింద గొవింద

అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము

ఏడు కొండల వాడ వెంకటా రమణ గొవిందా గొవిందా

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిల మునులకు
వేంకట రమణ సంకట హరణ
వేంకట రమణ సంకట హరణ
నారాయణ నారాయణ
అదివో నిత్య నివాస మఖిల మునులకు
అదె చూడుడు అదె మ్రోక్కుడు ఆనంద మయము
అదె చూడుడదె మ్రోక్కుడానంద మయము

అదివొ అల్లదివొ

ఏడు కొండల వాడ వెంకటా రమణ గొవిందా గొవిందా
ఆపద మ్రొక్కులవాడ అనాధ రక్షకా గొవిందా గొవిందా

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో అదివో
వేంకట రమణ సంకట హరణ
భావింప సకల సంపద రూప మదివో అదివో
పావనముల కెల్ల పావన మయము

అదివొ అల్లదివొ

జన్మమెత్తితిరా అనుభవించితిరా - చిత్రం : గుడి గంటలు

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
మంచి గెలిచి మానవుడుగ మారినానురా

జన్మమెత్తితిరా

స్వార్ధమంత సాటి మనిషి స్వారి చేసిరా
బ్రతుకంతా చెలరేగిర ప్రళయమా యెరా
స్వార్ధమంత సాటి మనిషి స్వారి చేసిరా
బ్రతుకంతా చెలరేగిర ప్రళయమా యెరా
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా
సమర భూమి నాహృదయం శాంతి చెందెరా

జన్మమెత్తితిరా

క్రోధ లోభ మోహములే పడగలెత్తితిరా
బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
క్రోధ లోభ మోహములే పడగలెత్తితిరా
బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యొతి తల్లివోలె ఆదరించెరా
ధర్మ జ్యొతి తల్లివోలె ఆదరించెరా
నా మనసె దివ్య మందిరముగ మారిపోయెరా

జన్మమెత్తితిరా

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముల కాంచగలమురా
మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముల కాంచగలమురా
ప్రతి గుండెలొ గుడి గంటలు ప్రతి ధ్వనించురా
ప్రతి గుండెలొ గుడి గంటలు ప్రతి ధ్వనించురా
ఆ దివ్య పథ న్యాయ పథం చూపగల్గురా

జన్మమెత్తితిరా

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో - చిత్రం : భూ కైలాస్

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
నమోనమో నమోనమో నమోనమో నమోనమో
పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలిత కింకర భవ నాశంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో

దేవదేవ ధవళాచల

దురిత వినోచనా ఫాలవిలోచన పరమ దయాకర నమోనమో
దురిత వినోచనా ఫాలవిలోచన పరమ దయాకర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో

దేవదేవ ధవళాచల

నమోనమో నమోనమో నమోనమో నమోనమో
నమోనమో నమోనమో నమోనమో నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారద హౄదయ విహారీ నమోనమో
నారద హౄదయ విహారీ నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
పంకజ నయన పన్నగ శయన
పంకజ నయన పన్నగ శయన
పంకజ నయన పన్నగ శయన
శంకర వినుత నమోనమో
శంకర వినుత నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో

ఘల్లు ఘల్లున గుండె ఝల్లన - చిత్రం : నీరాజనం

ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
మనసు తీరుగ మాటలాడక మౌనం ఎందుకన్నదీ

ఘల్లు ఘల్లున గుండె ఝల్లన

క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
క్షణమాగక తనవూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో

ఘల్లు ఘల్లున గుండె ఝల్లన

కల గీతమె పులకించెను నవ కళ్యాణ నాదస్వరం
కథ కానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం
కల గీతమె పులకించెను నవ కళ్యాణ నాదస్వరం
కథ కానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం

ఘల్లు ఘల్లున గుండె ఝల్లన

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి - చిత్రం : సప్తపది

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి మొహన మురళి ఇదేనా ఆ మురళి

రేపల్లియ

కాళింది మడుగున కాళియుని పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగున కాళియును పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
జీవన రాగమై బృందావన గీతమై
కన్నుల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆ నందనమురళి
ఇదేనా ఆ మురలి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి

రేపల్లియ

మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ నారాధ నా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ నారాధ నా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ

జల్లంత కవ్వింత కావాలిలే - చిత్రం : గీతాంజలి

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకులు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావాలిలే

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
మాయదేవుడే మొగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికొసమో

జల్లంత కవ్వింత కావాలిలే

పాడమని నన్నడగ తగునా - చిత్రం : డాక్టర్ చక్రవర్తి

పాడమని నన్నడగ తగునా
పదుగురెదుటా పాడనా
క్రిష్ణా పదుగురెదుటా పాడనా
పాడమని నన్నడగ తగునా
పదుగురెదుటా పాడనా

పొదల మాటున పొంచి పొంచి యెదను దోచిన వేణు గానము
పొదల మాటున పొంచి పొంచి యెదను దోచిన వేణు గానము
వొలక బోసిన రాగసుధకు మొలక లెత్తిన లలిత గీతి

పాడమని నన్నడగ తగునా

చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోప కాంతలు
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోప కాంతలు
మెచ్చలేరే వెచ్చని హౄదయాల పొంగిన మధుర గీతి

పాడమని నన్నడగ తగునా

యెవరు లేని యమునా తటినీ యెక్కడొ యేకాంతమందున
యెవరు లేని యమునా తటినీ యెక్కడొ యేకాంతమందున
నేను నీవై నీవు నేనై నేను నీవై నీవు నేనై పరవశించే ప్రణయ గీతి

పాడమని నన్నడగ తగునా

Sunday, February 4, 2007

మాణిక్య వీణా ముఫలాలయంతీం - చిత్రం : మహాకవి కాళిదాసు

మాణిక్య వీణా ముఫలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి

చతుర్భుజే చంద్రకళా వతంసే
కుచోన్నతే కుంకుమ రాగ శోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః

మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కల్యాణీ కదంబ వనవాసినీ

జయ మాతంగతనయే
జయ నీలోత్పల ద్యుతే
జయ సంగీత రసికే
జయ లీలా శుక ప్రియే

జై జననీ!

సుధాసముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య
కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీతసంభావనా సంభ్రమాలోల నీప స్రగాబద్ధ
చూళీ సనాథ త్రికే సానుమత్పుత్రికే
శేఖరీ భూత శీతాంశు రేఖా మయూఖావళీ
బద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే
కామలీలా ధనుస్సన్నిభభ్రూలతా పుష్ప సందేహ
కృచ్ఛారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే సురామే రమే

సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే
సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపేజగన్మాతృకే
హే జగన్మాతృకేపాహి మాం పాహి మాం పాహి పాహి

ఒకసారి కలలోకి రావయ్య - చిత్రం : గొల్ల గోపయ్య

ఒకసారి కలలోకి రావయ్యా...
ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా

ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే

పగడాల నా మోవి చిగురించెరా
మోము చెమరించెరా మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా (2)

చెమ్మోవి పై తేనె ఒలికించనా (2)
తనివి కలిగించనా మనసు కరిగించనా
కేరింత లాడించి శోలించనా (2)

ఒకసారి కలలోకి రావయ్య

వొంపు సొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే (2)

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా (2)
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేరిన వలపు పండించరా (2)

ఒకసారి కలలోకి రావయ్య

చదువు రాని వాడవని - చిత్రం : ఆత్మబంధువు

చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికి రాని బ్రతుకులెందుకు

చదువు రాని వాడవని

యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేప పిల్లలీద గలిగెను
యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేప పిల్లలీద గలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పెను

చదువు రాని వాడవని

తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయమున్న చాలు
చదువులతో పని యేమి హృదయమున్న చాలు
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చదువు రాని వాడవని

నా హృదయంలొ నిదురించే చెలీ - చిత్రం : ఆరాధన (అక్కినేని)

నా హృదయంలొ నిదురించే చెలీ
కలలలోనె కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే

నా హృదయంలొ నిదురించే చెలీ

నీ కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే

నా హృదయంలొ నిదురించే చెలీ

నా గానములొ నీవే ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించ రావే
పల్లవిగా పలుకరించ రావే
నీ వేచ్చని నీడ వేలసెను నా వలపుల మేడా
వెచ్చని నీడ వేలసెను నా వలపుల మేడా
నివాళితో చేయిసాచి యెదురు చూచినానే నిదుర కాచినానే

నా హృదయంలొ నిదురించే చెలీ

కోండ మీద సుక్క పోటు - చిత్రం : అల్లుడుగారు

కోండ మీద సుక్క పోటు గుండేలోన యేండపోటు
చేప్పుకుంటె సిగ్గుచేటు ఆడ్ని తలుసుకుంటె చురుకుపోటు
గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కు మందిరో
సిగ్గు సిటుక్కు సిటుక్కు సిటుక్కు మందిరో
గుండె గతుక్కు గతుక్కు గతుక్కు మందిరో
సిగ్గు సిట్టుకు సిట్టుకు సిట్టుకు మందిరో

కోండ మీద సుక్క పోటుగుండేలోన యేండపోటు
పిల్ల కేమో కులుకుపోటుదాని వోళ్ళు చూస్తే తుళ్ళి పాటు
గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కు మంటుందా
సిగ్గు సిటుక్కు సిటుక్కు సిటుక్కు మంటుందా
గుండె ఘతుక్కు ఘతుక్కు ఘతుక్కు మంటుందా
సిగ్గు సిటుక్కు సిటుక్కు సిటుక్కు మంటుందా

ఆరుబైట కెళ్ళామంటె ఆవిరి ఏన్నేల్ల కాసేనా
ఆకలై కోరికలేమో ఆకలి కేకలు ఏసేనా
ఆరుబైట కెళ్ళామంటె ఆవిరి ఏన్నేల్ల కాసేనా
ఆకలై కోరికలేమో ఆకలి కేకలు ఏసేనా
నిదురెట్టా పట్టేది కదనేట్టా ఆపేది
మనసేట్టా ఆగేది నా మరువేట్టా తీరేది
ఓలమ్మో ముద్దులగుమ్మ వయ్యారి ఎన్నెలకొమ్మా
నడి రేతిరి గుప్పేట్లో నడి గుండేల చప్పుట్లో
నడి రేతిరి గుప్పేట్లో నడి గుండేల చప్పుట్లో
నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేన
నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేన
ఇద్దరి నడుమ నిద్దరలేని ముద్దుల మద్దెల పాడించేన

కొంద మీద

వగలాడి మొగుడోస్తుంటే వేన్నేల వూయల వెయ్యాల
పగలు రేయనకుండా పందిరి మంచం నవ్వాల
వగలాడి మొగుడోస్తుంటే వేన్నేల వూయల వెయ్యాల
పగలు రేయనకుండా పందిరి మంచం నవ్వాల
నడుఁవోంపులు తెచైన నడి వోంపును చుట్టైన
గుడిలోన పడవల్లి సుడులేసుకు తిరిగైన
ఓరయ్యో అందగాడ సిందులాదే సెందురూడ
సుడులాడె సందిట్లో కవ్వించే కౌగిట్లో
సుడులాడె సంధిట్లో కవ్వించే కౌగిట్లో
వన్నెల చిన్నెల వోంపులు సోంపులు ఆడించైన
వన్నెల చిన్నెల వోంపులు సోంపులు ఆడించైన
నా సిగ్గులు మొగ్గుల బుగ్గల మీద యేర్రని పూలే పూయించైన

కొంద మీద

ఆరేసుకోబోయి పారేసుకున్నాను - చిత్రం : అడవి రాముడు

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
హరి హరి హరి హరి
కోకెత్తుకెల్లింది కొండగాలి
నువ్వు కొంటేచూపు చూస్తేనే
చలి చలి చలి చలి చలి చలి

ఆరేసుకోవాలని ఆరేసుకున్నావు
హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్తి పోతొంది
హరి హరి హరి హరి హరి హరి

నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ నా చేతి చలి మంటా కావాలి
నువ్వింకా కవ్వించకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను

నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాకా నా వలపు ఏరువాకా నీ తాకా నీలిమబ్బు నా కోకా
నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాకా నా వలపు ఏరువాకా నీ తాకా నీలిమబ్బు నా కోకా
నే రేగి పోవాలి
నే ఊగిపోవాలి
నే రేగి పోవాలి
నే ఊగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాటా కావాలి
ఆ పాటా పూబాటగా నిను చేరుకోవాలి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను

రాస లీల వేళ రాయబారమేల - చిత్రం : ఆదిత్య 369

రాస లీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేలా

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవీ చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలీ
తేనె వానలో చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని

రాసలీల వేళ

మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు

రాసలీల వేళ

Friday, February 2, 2007

రాగాల పల్లకిలో కోకిలమ్మ - చిత్రం : శుభలేఖ

రాగాల పల్లకిలో కోకిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మా
నా ఉద్యోగం పోయిందండి
తెలుసు, అందుకే
రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగ బోయినందుకమ్మ

రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మా
రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మ

రాగాల

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
బహుశా అది తెలుసో ఏమొ
బహుశా అది తెలుసో ఏమొ జాణకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ

రాగాల

గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుశ తను ఎందుకనేమొ
బహుశ తను ఎందుకనేమొ గడుసుకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ

రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ

రాగాల

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను - చిత్రం : యమగోల

గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
యాడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

కమ్మని పాట చక్కని ఆట
కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా కొందరు నన్ను
పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు
నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైపడతారు
దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు

గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను

బందరులోనా అందరిలోనా
రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు
రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె
తిరపతి లోనా పరపతి పోయే
అందరి మెప్పు పొందాలంటె
దేవుడైకైన తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో - చిత్రం : ఆమరశిల్పి జక్కన

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో

ఈ నల్లని రాలలో

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి

ఈ నల్లని రాలలో

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనె గల గల మని పొంగి పొరలు
ఈ నల్లని రాలలో

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును

ఈ నల్లని రాలలో