దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి
కలలో ఇలలో యే కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి
కలలొ ఇలలో
శివ పర్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరినీ మా జతలో చూపించాలి
శ్రీ కాంతుల కోలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలి లోన పున్నమి పూల వెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి
కలలొ ఇలలో
తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళ తేచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వేలుగిచ్చే మణి దీపం నీవంటాడు
ఈ పుత్తడి బోమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట
నిధి నిక్షేపాలు నిదురే లేచి ఏదురొచ్చేనంట
కలలొ ఇలలో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment