అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నరు
వారు చదువు సంధ్యలుండి కూడ
చవట లయ్యారు వొట్టి చవట లయ్యారు
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
పడక మీద తుమ్మ ముళ్ళు పరచె నొక్కడు
అయ్యో ఇంటి దీప మార్పి వేయ నెంచె నొక్కడు
తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు
తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు
పడుచు పెళ్ళామే బెల్లమని
భ్రమసె నొక్కడు భ్రమసె నొక్కడు
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమ యనె పాలు పోసి పెంపు చేసేను
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమ యనె పాలు పోసి పెంపు చేసెను
కంటి పాప కంటె యెంతొ గారవించెను
కంటి పాప కంటె యెంతొ గారవించెను
దాని గుండె లోన గూడు కట్టి
ఉండ సాగెను తానుండ సాగెను
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నదె ఒక నాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నదె ఒక నాటికి రత్నమౌనురా
కూరిమి గల వారంతా కొడుకు లేనురా
కూరిమి గల వారంతా కొడుకు లేనురా
జాలిగుండె లేని కొడుకు కన్న
కుక్క మేలురా కుక్క మేలురా
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment