పాడమని నన్నడగ తగునా
పదుగురెదుటా పాడనా
క్రిష్ణా పదుగురెదుటా పాడనా
పాడమని నన్నడగ తగునా
పదుగురెదుటా పాడనా
పొదల మాటున పొంచి పొంచి యెదను దోచిన వేణు గానము
పొదల మాటున పొంచి పొంచి యెదను దోచిన వేణు గానము
వొలక బోసిన రాగసుధకు మొలక లెత్తిన లలిత గీతి
పాడమని నన్నడగ తగునా
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోప కాంతలు
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోప కాంతలు
మెచ్చలేరే వెచ్చని హౄదయాల పొంగిన మధుర గీతి
పాడమని నన్నడగ తగునా
యెవరు లేని యమునా తటినీ యెక్కడొ యేకాంతమందున
యెవరు లేని యమునా తటినీ యెక్కడొ యేకాంతమందున
నేను నీవై నీవు నేనై నేను నీవై నీవు నేనై పరవశించే ప్రణయ గీతి
పాడమని నన్నడగ తగునా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment