చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ
చల్తీకానాం గాడీ చలాకీ వన్నె లేడీ
రంగేళి జోడీ బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా
తప్పవా దారి చెప్పవా చెప్పవా
చల్తీకానాం గాడీ
దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు
విరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు
అశోకుడు యుధ్ధంలోన వాడిందీ ఈ కారు
శివాజీ గుర్రం వీడి ఎక్కిందీ ఈ కారు
చరిత్రల లోతులు చేరి వ్రాతలు మారి
చేతులు మారినదీ జంపరు బంపరు బండిరా
బండిరాజగ మొండిరా మొండిరా
చల్తీకానాం గాడీ
ఆంగ్లేయులు తోలిన కారు అంధ్రానే ఏలిన కారు
అందాల లండన్ కారు అన్నింటా ఇండియన్ కారు
బులెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు
రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు
హుషారుగ ఎక్కిన చాలు
దక్కును మేలు చిక్కు శిఖాలు
ఇదే సూపరు డూపరు బండిరా
బండిరా జగ మొండిరా మొండిరా
చల్తీకానాం గాడీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment