ఆరేసుకోబోయి పారేసుకున్నాను
హరి హరి హరి హరి
కోకెత్తుకెల్లింది కొండగాలి
నువ్వు కొంటేచూపు చూస్తేనే
చలి చలి చలి చలి చలి చలి
ఆరేసుకోవాలని ఆరేసుకున్నావు
హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్తి పోతొంది
హరి హరి హరి హరి హరి హరి
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా
నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ నా చేతి చలి మంటా కావాలి
నువ్వింకా కవ్వించకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాకా నా వలపు ఏరువాకా నీ తాకా నీలిమబ్బు నా కోకా
నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాకా నా వలపు ఏరువాకా నీ తాకా నీలిమబ్బు నా కోకా
నే రేగి పోవాలి
నే ఊగిపోవాలి
నే రేగి పోవాలి
నే ఊగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాటా కావాలి
ఆ పాటా పూబాటగా నిను చేరుకోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment