ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమని పాడవే
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల రాయగా స్వరాల సంపదతరాల నా కథ
క్షణాలదే కదా గతించి పోవు గాధ నేననీ
ఆమని పాడవే
శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయం
దివీ భువీ కలా నిజం స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోని గాధ నేననీ
ఆమని పాడవే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment