అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా
అంతా భ్రాంతియేనా
చిలిపి తనాల చెలిమే మరచితివో
చిలిపి తనాల చెలిమే మరచితివో
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో
పేదరికమ్ము ప్రేమ పదమ్ము మూసి వేసినదా
నా ఆశే దోచినదా
అంతా భ్రాంతియేనా
మనసున లేని వారి సేవలతో
మనసున లేని వారి సేవలతో
మన సేయగలేని నీపై మమతలతో
మన సేయగలేని నీపై మమతలతో
వంతలపాలై చింతిల్లుటేనా వంతా దేవదా
నావంతా దేవదా
అంతా భ్రాంతియేనా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment