Wednesday, February 21, 2007

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా - చిత్రం : ఇంద్ర

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా
దాయి దాయి దామ్మా పలికే గండు కొయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఓహో ఓ ఒళ్ళో వాలు మా ఓహో ఓ వయసే గిల్లుమా
నీవెల్లా విరబూసే నవ యవ్వనాల బొమ్మ
తొలిజల్లే తరిమేసే సరసాలు కొంటెతనమా

దాయి దాయి దామ్మా

టక టక మంటూ తలపులు తట్టి తికమక పెట్టే
లకుమకి పిట్టా నిను వదిలితే ఎట్టా
నిలబడ మంటూ నడుమును పట్టి కిటకిట పెట్టే
మగసిరి పట్టా కథ ముదిరేది ఎట్టా
కేరింత లాడుతూ కవ్వించ లేదా కాదంటె ఇప్పుడు తప్పేదెలా
కాదంటే ఇపుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జానంటూ లేదా ఏం దుడుకు బావా ఆపేదెలా
ఏం దుడుకు బావా ఆపేదెలా
ఓహో ఓ కోరిందే కదా ఓహో ఓ మరీ ఇంత ఇదా
మరి కొంచెం మరిపించే ఈ ముచ్చటంతా చేదా
వ్యవహారం శృతి మించే సుఖ మారి బెదిరి పోదా
హాయ్ హాయ్ హాయ్ అనరే పైట జారి పోయే
పాపా గమనించవే మా కొంప మునిగిపోయే అయ్యో

దాయి దాయి దామ్మా

పురుషుడు ఎట్టా ఇరుకున పెట్టె పరుగుల పరువా
సొగసుల దరువా ఓ తుంటరి మగువా
ముడుపులు ఎట్టా ఎదురుగా పెట్టా ఎదుగడలేవా
నాకు జత కావా నా వరసైపోవా
అల్లాడి పోకే పిల్లా మరి ఆ కల్యాణ ఘడియ రానీయవా
కల్యాణ ఘడియ రానీయవా
అని అందాక ఆగదు ఈ అల్లరి నీ హిత భోధలాపి శృతి మించవా
హిత భోధలాపి శృతి మించవా
అనుమానం అడిగింది నువ్వు ఆడపిల్లవేనా
సందేహం లేదయ్యొ నీ పడుచు పదును పైన

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా

No comments: