Wednesday, February 21, 2007

యమునా తీరమున సంధ్యా సమయమున - చిత్రం : జయభేరి

యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కన్నులతో రాధ వేచి ఉన్నది కాదా

మంజు ఎంటి ఆపేసావు ?
ఏమి లేదు
ఆపకు మంజు నీ గాలి మువ్వల సవ్వడి
నా గానానికి జీవం పోయాలి
నా పాటకు నడక నేర్పాలి

రావోయి రాసవిహారి
బాస చేసి రావేల మదన గోపాల
బాస చేసి రావేల మదన గోపాల
నీవు లేని జీవితము తావి లేని పువ్వు కదా

యమునా తీరమున

పూపొదలో దాగనేల పో పోర సామి
ఇంతసేపు ఏ ఇంటికి వంత పాడినావొ
దాని చెంతకె పోరాదో
రానంత సేపు విరహమ
నేను రాగానే కలహమ
రాగానే కలహమ
నీ మేన సరసాల చిన్నెలు
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
ఏ కొమ్మ కొనగూటి ఆనవాలూ

యమునా తీరమున

దోబూచులాడితి నీతోనే
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు
ఈ కొమ్మ గురుతులు కాబోలు
నేను నమ్మనులే
నేను నమ్మనులే నీ మాటలు
అవి కమ్మని పన్నీటి మూటలు
నా మాట నమ్మవె రాధిక
ఈ మాధవుడు నీ వాడే గా
రాధికా ... మాధవా ...
రాధికా ... మాధవా ...

యమునా తీరమున

No comments: