పట్టుదలతో చేసేయ్ సమరం తప్పకుండ నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
ఈ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడక
నీ ధ్యేయం చూపే మార్గంలో నువు పోరా సూటిగా
ఏ నాడు వెనకడు గేయక ఏ అడుగు తడబడ నీయక
నీ గమ్యం చేరే దాక ధూసుకు పోరా సొదరా
ఇష్టం ఉంటే చేదు కూడ తీయనే
కష్టం అంటే దూది కూడ భారమే
లక్ష్యమంటు లేని జన్మే దండగ
లక్షలాది మంది లేరా మందగా
పంతం పట్టి పోరాడందే
కోరిన వరాలు పొందలేరు కదా
పట్టుదలతో
చేస్తు ఉంటే ఏ పనైనా సాద్యమే
చూస్తు ఉంటే రోజులన్ని శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనేది లేదురా
నవ్వే వాళ్ళు నిద్దుర పోగా
దిక్కులు జయించి సాగిపోరా మరి
పట్టుదలతో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment