పాడనా తెలుగు పాట పాడనా తెలుగు పాట
పరవశమై మీ ఎదుట మీ పాటపాడనా తెలుగు పాట
పాడనా తెలుగు పాట
కోవెల గంటల ఘన ఘనలో గోదావరి తరగల గల గలలో
కోవెల గంటల ఘన ఘనలో గోదావరి తరగల గల గలలో
మావులు పూవులు మోపుల పైనా మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట
పాడనా తెలుగు పాట
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివి తీర వినిపించినది
నాడు నాడులా కదిలించేది
వాడ వాదలా కనిపించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల వూట ఒక పాట
పాడనా తెలుగు పాట
ఒళ్ళంత వయ్యారి కోక కనులకు కాటుక రేఖ
ఒళ్ళంత వయ్యారి కోక కనులకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడె
తెలుగు తల్లి పెట్టని కొత్త తెనుగును నాట ప్రతి చోట ఒక పాట
పాడనా తెలుగు పాట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment