అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏల జాలవా
అలిగితివా సఖీ ప్రియా కలత మానవా
అలిగితివా సఖీ ప్రియా
లేని తగవు నటింతువా
మనసు తెలియనెంచితివా
లేని తగవు నటింతువా
మనసు తెలియనెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయను జూడవా
అలిగితివా సఖీ ప్రియా
నీవె నాకు ప్రాణమని
నీ ఆనతి మీరననీ
వె నాకు ప్రాణమని
నీ ఆనతి మీరననీ
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా
అలిగితివా సఖీ ప్రియా
ప్రియురాలివి సరస నుండి
విరహ మిటుల విధింతువా
ఆ ... ప్రియురాలివి సరసనుండి
విరహమిటుల విధింతువా
భరింపగ నా తరమా కనికరించవా
అలిగితివా సఖీ ప్రియా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment