రాగాల పల్లకిలో కోకిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మా
నా ఉద్యోగం పోయిందండి
తెలుసు, అందుకే
రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగ బోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ యెందుకమ్మా
రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలె మూగబోయినందుకమ్మ
రాగాల
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
బహుశా అది తెలుసో ఏమొ
బహుశా అది తెలుసో ఏమొ జాణకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల
గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గోంతులో పాటలయి పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుశ తను ఎందుకనేమొ
బహుశ తను ఎందుకనేమొ గడుసుకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేనా నీవుంటే కూనలమ్మ
రాగాల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment