నీవేనా
నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది
నీవేనా నామదిలో నిలిచి హౄదయము కలవర పరిచినది
నీవేనా
నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది
నీవేలే నా మదిలో నిలిచి హృదయము కలవర పరిచినది
నీవేలే
కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైష్ణవ మాయో
తెలిసి తెలియని అయోమయములో
నీవేనా నను తలచినది
కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి
కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి
కనులను మనసును కరగించి
మైమరపించి నన్నలరించి
నీవేనా నను తలచినది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment