Sunday, February 4, 2007

ఒకసారి కలలోకి రావయ్య - చిత్రం : గొల్ల గోపయ్య

ఒకసారి కలలోకి రావయ్యా...
ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా

ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే

పగడాల నా మోవి చిగురించెరా
మోము చెమరించెరా మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా (2)

చెమ్మోవి పై తేనె ఒలికించనా (2)
తనివి కలిగించనా మనసు కరిగించనా
కేరింత లాడించి శోలించనా (2)

ఒకసారి కలలోకి రావయ్య

వొంపు సొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే (2)

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా (2)
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేరిన వలపు పండించరా (2)

ఒకసారి కలలోకి రావయ్య

No comments: